ETV Bharat / state

జోగులాంబ జిల్లాలో రిజిస్ట్రేషన్ల విధానాన్ని పరిశీలించిన కలెక్టర్ శృతి ఓఝా - Dharani Portal Latest News

జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్​ మండలంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ శృతి ఓఝా సందర్శించారు. రిజిస్ట్రేషన్లు జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు.

Collector Shruti Ojha examined the registration process in Jogulamba district
జోగులాంబ జిల్లాలో రిజిస్ట్రేషన్ల విధానాన్ని పరిశీలించిన కలెక్టర్ శృతి ఓఝా
author img

By

Published : Nov 3, 2020, 4:06 PM IST

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ధరణి పోర్టల్ ప్రారంభమైనందున భూ క్రయ విక్రయదారులు మీసేవా ద్వారా స్లాట్లు బుక్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శృతి ఓఝా తెలియజేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్​ మండలంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించి రిజిస్ట్రేషన్లు జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు.

మల్దకల్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ రోజు స్లాట్ బుక్ చేసుకున్న కొనుగోలుదారైన కంసలి పద్మమ్మకు కలెక్టర్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ పత్రాలు అందజేశారు. భూ కొనుగోలుదారుడు, విక్రయదారుడు మీ సేవాలో స్లాట్ బుక్ చేసుకుని అందుకు సంబంధించిన దస్తవేజులు అసలు కాపీలతో పాటుగా ఆధార్​కార్డు, పట్టాదారు పాస్ బుక్కు, డిక్లరేషన్​తో పాటుగా అండర్ టెకింగ్ పత్రాలను తీసుకువచ్చే విధంగా మీసేవా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను, ఇంటర్నెట్ వేగాన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.