జోగులాంబ గద్వాల జిల్లాలోని పురపాలికల్లో అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేయాలని మున్సిపల్ ఇంజనీర్లతోపాటు మున్సిపల్ కమిషనర్లు శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ శృతి ఓఝా ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్రీహర్షతో కలిసి నాలుగు మున్సిపాలిటీల కమిషనర్లు, పబ్లిక్ బెల్త్ కార్యనిర్వాహక ఇంజినీరు, డీఈలు, ఏఈలతో సమీక్ష నిర్వహించారు.
14వ ఫైనాన్స్ ద్వారా 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నిధులు మున్సిపల్ కమిషనర్ ఖాతాల్లో జమై ఉన్నా... పనులు మాత్రం పూర్తి కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా జిల్లాలో అవసరమైన ఓవర్‌హెడ్ ట్యాంక్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఆ తర్వాత అనంతపురం గ్రామంలో రాంరెడ్డి అనే సాగు చేస్తున్న జీలుగ పంటలను పరిశీలించారు. ఆ తర్వాత గద్వాల మండలంలోని పూడురు, అనంతపూర్, మేళ్లచెరువు, కాకులారం, కొండపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణ పనులను పరిశీలించారు. రైతు వేదికలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ శ్రుతి ఓఝా సూచించారు. వీటి నిర్మాణంలో నాణ్యత లోపం లేకుండా చూడాలని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి: కర్ణాటకలో కరోనా కల్లోలం- ఒక్కరోజే 9 వేల కేసులు