ETV Bharat / state

'నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు' - అధికారులపై గద్వాల కలెక్టర్ సీరియస్

జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలంలోని మారబీడు గ్రామాలను కలెక్టర్ శృతి ఓఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరూర్ మండలంలో చెత్తా చెదారం పడి ఉండటాన్ని గమనించిన కలెక్టర్ పంచాయతీ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

'నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు'
'నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు'
author img

By

Published : Aug 12, 2020, 11:35 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలంలోని మారబీడు గ్రామాలను కలెక్టర్ శృతి ఓఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరూర్ మండలంలో చెత్తా చెదారం పడి ఉండటాన్ని గమనించిన కలెక్టర్ పంచాయతీ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల హెడ్ క్వార్టర్​లోనే పరిశుభ్రత లేకుంటే గ్రామాల్లో ఎలా ఉంటుందని ఎంపీఓను ప్రశ్నించారు.

పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహించిన పంచాయతీ సెక్రటరీపై చర్యలు తీసుకునే విధంగా జిల్లా పంచాయతీ అధికారికి తెలపాలని కలెక్టర్ ఆదేశించారు. పల్లె ప్రకృతి వనానికి కావలసిన మొక్కలు సేకరించి దట్టంగా నాటేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.