ETV Bharat / state

పురపాలికలను అభివృద్ధి చేసుకోవాలి

గద్వాల జిల్లాలో స్థానక హోటల్లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి ప్రణాళిక సదస్సును కలెక్టర్​ అధ్యక్షతన నిర్వహించారు. పట్టణ ప్రగతి ప్రణాళికలో పట్టణలను సుందరంగా తీర్చుదిద్దుకోవాల్సిన సమయం వచ్చిందని గద్వాల శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్​ శృతి ఓజా పేర్కొన్నారు.

collector-shruthi-oja-review-on-pattana-pragathi-at-gadwal-district
పురపాలికలను అభివృద్ధి చేసుకోవాలి
author img

By

Published : Feb 23, 2020, 3:28 PM IST

ఈ నెల 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు చేపట్టనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పుర కమిషనర్లు, ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులు నియమ నిబద్ధతతో పనిచేసి పురపాలికలను అభివృద్ధి చేసుకోవాలని గద్వాల కలెక్టర్‌ శృతి ఓజా అన్నారు. శనివారం స్థానిక హరిత హోటల్లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి - ప్రణాళిక సదస్సును కలెక్టర్‌ అధ్యక్షత వహించగా గద్వాల, అలంపూర్‌ ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, డా.వీఎం.అబ్రహాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రభుత్వం 2019 అక్టోబర్‌లో తెచ్చిన కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం అన్ని పురపాలికల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బంధీగా నిర్వహించబోతున్నట్లు కలెక్టర్​ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారిని నియమించి అందులో నాలుగు పౌర కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో మహిళా కమిటీ, యువజన కమిటీ, విశ్రాంత ఉద్యోగులతో కూడిన కమిటీ, ప్రజా ప్రతినిధుల కమిటీలు ఉంటాయన్నారు.

హరితహారంపై ప్రత్యేకశ్రద్ధ పెట్టి నాటిన మొక్కలు కనీసం 85 శాతం బతికేలా చూడాల్సి ఉంటుందన్నారు. మున్సిపల్‌ చట్టం ప్రకారం పురపాలిక నిధుల నుంచి 10శాతం నిధులు హరితహారానికి ఖర్చు చేయాలని తెలియజేశారు. మార్చి 31లోగా పురపాలికలో 100శాతం ప్రాపర్టీ ట్యాక్స్‌ వసూలు చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి 10రోజుల పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ కోరారు.

పురపాలికలను అభివృద్ధి చేసుకొనేందుకు పార్టీలకు అతీతంగా ఛైర్‌పర్సన్‌తో పాటు ప్రతి ఒక్క కౌన్సిలర్‌ కృషిచేయాలని గద్వాల ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పల్లెలను చూసి పట్టణాలు నేర్చుకోవాల్సి ఉందని, పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత పచ్చదనంలో గణనీయంగా పురోగతిని సాధించామని కొనియడారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.