చిన్న పిల్లల్లో రక్తహీనత తగ్గించటంతోపాటు పిల్లల ఆరోగ్య సంరక్షణకు స్త్రీ శిశు సంక్షేమ శాఖతోపాటు లైన్ డిపార్టుమెంట్లు తమ వంతు బాధ్యతను నెరవేర్చాల్సిందిగా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కె.సరిత అన్నారు. జోగులాంబ గద్వాల కలెక్టరేట్‌లో జరిగిన పోషణ్ అభియాన్ రెండవ త్రైమాసిక సమావేశానికి కలెక్టర్ శృతి ఓజా, జడ్పీ ఛైరపర్సన్ కె. సరిత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
జిల్లా అంగన్‌వాడీ కేంద్రాలకు కావాల్సిన బాలమృతం ఇండెక్స్ వివరాలు అందించాలని అధికారులను కలెక్టర్ శృతి ఓజా ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమియా పరీక్షలు నిర్వహించి బాధితుల పూర్తి వివరాలు సేకరించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: కరోనా పరీక్షల ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమానం