జోగులాంబ గద్వాల జిల్లా పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ శ్రుతి ఓజా పాల్గొన్నారు. పోలీసులు గౌరవ వందనం స్వీకరించిన జాతీయజెండాను ఆవిష్కరించారు. రాష్ట్రప్రభుత్వం జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులపై నివేదికను ఆమె చదివి వినిపించారు.
ప్రజలకు అనుగుణంగా రాజ్యాంగం: ఎమ్మెల్యే
![collector and mla participated in republic day celebrations in jogulamba gadwal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10391944_pms_1.jpg)
భారత పౌరులకు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ అమల్లోకి వచ్చిన రోజుకు గుర్తుగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు అనుగుణంగా రూపొందించిన చట్టాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన సూచించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశంకోసం పోరాడిన నాయకులను ఆయన గుర్తు చేసుకున్నారు.