cm kcr tour: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి వెళ్లనున్నారు. జోగులాంబ గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తండ్రి ఇటీవల మరణించడంతో ఆయనను కేసీఆర్ పరామర్శించనున్నారు. ఉదయం 11.00 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి ... రోడ్డు మార్గాన ఒకటిన్నర గంటలకు గద్వాల జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం తిరిగి రెండు గంటలకు రోడ్డు మార్గాన హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్డుమార్గంలో వెళ్లనుండడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:
MLC's Oath today: నేడు ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల ప్రమాణం