ETV Bharat / state

జోగులాంబ అమ్మవారికి ఎమ్మెల్యే అబ్రహం పట్టువస్త్రాల సమర్పణ - mla abraham latest news

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లోని జోగులాంబ అమ్మవారికి ఎమ్మెల్యే అబ్రహం పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్రం ఉన్న ఏకైక శక్తి పీఠమైన జోగులాంబ ఆలయంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని అబ్రహం కోరారు.

clothes distribution by mla abraham in  jogulamba gadwal district
జోగులాంబ అమ్మవారికి ఎమ్మెల్యే అబ్రహం పట్టువస్త్రాల సమర్పణ
author img

By

Published : Oct 21, 2020, 2:46 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా ఐదో శక్తి పీఠమైన జోగులాంబదేవి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఐదో రోజు స్వామి, అమ్మవార్ల కల్యాణం సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కర్నూలు నుంచి అమ్మవారికి పట్టువస్త్రాలు వచ్చేవని.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు అందజేస్తున్నట్లు అబ్రహం వివరించారు. తెలంగాణలో ఏకైక శక్తిపీఠమైన జోగులాంబ ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్​ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు.

ఇవీచూడండి: వరదల నేపథ్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.