జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామపురం గ్రామానికి చెందిన యువకులు తిరుపతికి వెళ్లి వచ్చారు. ఇందులో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. మిగతా వారికి లక్షణాలు లేకపోవడం వల్ల వైద్య సిబ్బంది ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. హఠాత్తుగా వారిలో ఒక యువకుడు మృతి చెందాడు. దీంతో కరోనాతోనే చనిపోయాడన్న భయంతో జేసీబీ సహాయంతో ఖననం చేశారు.
అయితే వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నాడు. మృతి చెందిన వ్యక్తికి కూడా వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి ఉంటే జాగ్రత్తలు తీసుకునే వాడు కదా అని స్థానికులు ఆరోపిస్తున్నారు. కరోనా భయంతో జేసీబీ సాయంతో ఖననం చేసుకునే పరిస్థితి వచ్చిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?