ETV Bharat / state

BRS MLA Ticket Issue in Gadwal : బీఆర్​ఎస్​లో అసమ్మతుల సెగ.. అలంపూర్‌ టికెట్‌ ఎవరికి ? - బీఆర్​ఎస్​ కార్యకర్తల మధ్య వాగ్వాదం

BRS MLA Ticket Issue in Gadwal : గద్వాల జిల్లాలోని బీఆర్​ఎస్​ ప్రకటించిన అలంపూర్‌ అభ్యర్థిత్వం చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్రహంను మార్చాలని సొంత పార్టీలోని ఓ వర్గం డిమాండ్ చేయగా.. అభ్యర్థిని మార్చొద్దని మద్దతుదారులు పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించారు. న్యాయం చేయాలంటూ బీఆర్​ఎస్​ సీనియర్‌ నేత మందా జగన్నాధం కోరుతున్నారు. అలంపూర్ బీఆర్​ఎస్​ అభ్యర్థిని మార్చుతారా.. లేక కొనసాగిస్తారా అన్నది నేడు తేలనుంది.

Telangana Assembly Electios 2023
BRS MLA Ticket Issue in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2023, 8:01 AM IST

BRS MLA Ticket Issue in Gadwal బీఆర్​ఎస్​లో అసమ్మతుల సెగ.. అలంపూర్‌ టికెట్‌ ఎవరికి

BRS MLA Ticket Issue in Gadwal : జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజక వర్గంలో బీఆర్​ఎస్​లో అసమ్మతి తీవ్రస్థాయికి చేరుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను అభ్యర్ధిగా ప్రకటించడంతో.. అదే నియోజక వర్గానికి చెందిన కొందరు నేతలు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభ్యర్థిని మార్చాలంటూ శుక్రవారం ఎర్రవల్లి చౌరస్తాలో సమావేశం కూడా నిర్వహించారు.

Gadwal BRS MLA Ticket Issue : అబ్రహం కాకుండా ఎవరిని అభర్థిగా ప్రకటించినా మద్దతు ఇస్తామని అసమ్మతి వర్గం తేల్చిచెప్పింది. అక్కడితో ఆగకుండా ఏకంగా ప్రగతిభవన్‌కు వెళ్లి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌(KTR)కు వినతిపత్రం అందించారు. పెద్ద ఎత్తున అసంతృప్తులు ప్రగతి భవన్‌ వెళ్లడంతో కేటీఆర్‌ ఈ విషయాన్ని పార్టీ అధినేత కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

CM KCR Election Tour : సీఎం కేసీఅర్ ఎన్నికల సభల షెడ్యూల్ ఖరారు.. ఈనెల 15 నుంచి నవంబర్ 9 వరకు..

BRS Followers React on Gadwal MLA Ticket : అబ్రహం(Abraham) అభ్యర్థిత్వాన్ని సమర్ధిస్తూ శనివారం శాంతినగర్​లో ఆయన మద్దతు దారులు పెద్దఎత్తున సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రకటించిన విధంగా అబ్రహాంనే అభ్యర్ధిగా కొనసాగించాలని, అభ్యర్థిని మార్చితే తదనంతర పరిణామాలు అలంపూర్​లో ఇతర పార్టీలకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.

Minister KTR Meet Ponnala Lakshmaiah : బీఆర్​ఎస్​లో చేరేందుకు పొన్నాల సుముఖత.. సముచిత స్థానం కల్పిస్తాం : కేటీఆర్

Manda Jagannadham Want to BRS MLA Ticket : మరోవైపు అలంపూర్ నుంచి తన కుమారునికి అవకాశం ఇవ్వాలని బీఆర్​ఎస్(BRS Leader)​ నేత మంద జగన్నాధం కోరుతున్నట్లు సమాచారం. రాష్ట్రావిర్భావం తర్వాత అలంపూర్ నియోజక వర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశామని, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా ఇన్నేళ్లూ పార్టీ కోసం పనిచేశామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్ధిత్వాన్ని సొంత పార్టీలోని నాయకులే వ్యతిరేకిస్తున్నందున తమ కుమారునికి అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించాలని మంద జగన్నాధం కోరుతున్నట్లుగా తెలుస్తోంది.

"తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తికి టికెట్​ ఇవ్వడం.. పార్టీ నిర్దేశాలను పాటించాలని గౌరవంతో ఉన్నాం. భవిష్యత్​లో రాజ్యాంగ పరంగా పదవులు ఇస్తామని చెప్పిన.. ఎమ్మెల్యే టికెట్​ ఇవ్వకపోవడం ఘోర అవమానం. ఈ విషయంలో ఎన్ని సార్లు నివేదించినా మాకు నచ్చజెప్పుతున్నారు కానీ న్యాయం చేయడం లేదు."- మందా జగన్నాధం, మాజీ ఎంపీ

Who is Gadwal BRS MLA Candidate : ప్రస్తుతం ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్ధిత్వాన్ని సొంత పార్టీలోని నాయకులే వ్యతిరేకిస్తున్నందున.. తన కుమారునికి అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించాలని మందా జగన్నాధం(Manda Jagannadham) కోరుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాపరిణామాల నేపథ్యంలో.. అలంపూర్‌లో బీఆర్​ఎస్​ అభ్యర్ధిని మార్చుతారా? సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకే నేడు ఎన్నికల ప్రణాళిక ప్రకటన తర్వాత బీఫారం ఇస్తారా లేదా అన్నది తేలనుంది.

BRS Political Heat in Yellandu : ఎన్నికల వేళ.. ఇల్లందులో రసవత్తరంగా బీఆర్ఎస్ రాజకీయం

BRS Election Plan in Kamareddy 2023 : కామారెడ్డిలో బీఆర్ఎస్ ప్రచార జోరు.. 100 మంది ఓటర్లకో ఇంఛార్జ్​తో పక్కా ప్లాన్​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.