అమ్మవారిని రథంపై నగరవీదుల్లో ఊరేగించారు. బాణాసంచా కాలుస్తూ, మేళతాళాలతో సందడి చేశారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అలరింపజేశాయి. శక్తి వేషాలు, ఇతర సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
మాజీ మంత్రి డీకే అరుణ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్మించుకుని మొక్కులు చెల్లించారు. స్థానికులే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ కమిటీ చర్యలు తీసుకుంది.