ETV Bharat / state

ప్రైవేటు టీచర్లకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలి: బీజేవైఎం

author img

By

Published : Oct 19, 2020, 4:16 PM IST

ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లాలో బీజేవైఎం నాయకులు ధర్నా చేపట్టారు. ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి వారికి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ప్రైవేటు టీచర్ల కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

bjym protest for private teachers at collectorate in jogulamba gadwal
ప్రైవేటు టీచర్లకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలి: బీజేవైఎం

ప్రైవేటు టీచర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ... బీజేవైఎం అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేటు టీచర్లకు, లెక్చరర్లకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి... వారికి ఆర్థిక సాయం అందజేయాలని కోరుతూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. భావితరాలకు విద్యనందించే టీచర్లకు ఏర్పడుతోన్న సమస్యలతో భవిష్యత్‌లో తీవ్ర సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

కరోనా కాలంలో పాఠశాలలు, కళాశాలలు మూతపడి ప్రైవేటు టీచర్ల కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయని భాజపా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వారి జీవితాలు వీధిన పడి పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఆరు నెలలుగా జీతాలు లేక కూలీలుగా బతుకుతున్నారని అన్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.