ETV Bharat / state

బిల్లులపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: డీకే అరుణ - డీకే అరుణ లేటెస్ట్​ వార్తలు

వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ముచ్చటించారు.

bjp national vicepresident dk aruna on agriculture acts in jogulamba gadwala district
అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: డీకే అరుణ
author img

By

Published : Dec 17, 2020, 8:00 PM IST

కొంత మంది రైతులను తప్పదోవ పట్టిస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్పారు. వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. దళారుల లాభాపేక్ష కోసం లేనిపోనివి సృష్టిస్తున్నారని ఆరోపించారు. కృత్రిమంగా చేసే ఉద్యమాలకు రైతులు మద్దతు ఉండదన్నారు.

భారత్ బంద్​లో తెరాస, ఇతర కొన్ని పార్టీల వ్యక్తులు మాత్రమే పాల్గొన్నారని.. రైతులు పాల్గొనలేదని తెలిపారు. ప్రజల్లో భాజపా, నరేంద్ర మోదీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సన్నరకాలు వేసుకోండని చెప్పిన కేసీఆర్ వాటిని ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో సన్న రకాలకు రూ. 2,100కు కొనుగోలు చేస్తుంటే.. తెలంగాణలో కొనడం లేదన్నారు.

అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: డీకే అరుణ

ఇదీ చదవండి: పెన్నా నదిలో ఏడుగురు గల్లంతు... ఇద్దరి మృతదేహాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.