జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అలంపూర్లో కూడా ఆన్లైన్ సభ్యత్వాన్ని నమోదు చేస్తున్నామని వెల్లడించారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానేనని ఆయన అన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నామని.. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 36 లక్షల సభ్యత్వాలు నమోదు చేస్తామన్నారు.
ఇవీ చూడండి: చిరువ్యాపారుల భవన సముదాయానికి మంత్రి శంకుస్థాపన