రాష్ట్రంలో బంగారు తెలంగాణ కాదు... బంగారు కుటుంబంగా కల్వకుంట్ల కుటుంబం మారిందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. నోట్లతో ఓటు కొనాలనే నీచ బుద్ధిని తెరాస ప్రదర్శిస్తోందని మండి పడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
బంగారు తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయ పార్టీ భాజపా మాత్రమేనని... కాంగ్రెస్ పట్టుకోల్పోయిందని ఆమె అన్నారు.
ఇదీ చదవండి: కార్యకర్త కుమార్తె పుట్టిరోజుకు కేటీఆర్ విష్