జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రొ. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ జెండాను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎగురవేశారు. పార్టీ 18 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు, కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందిందని తెలిపారు. తెరాస ప్రభుత్వం కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ భాస్కర్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ బి.ఎస్.కేశవ్, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : నామినేషన్ వేయొద్దని బెదిరిస్తున్నారు.. వారణాసిలో పసుపు రైతులు:
బంగారు తెలంగాణ సాధనే... తెరాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి 18 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు, కార్యక్రమాలు చేసి ప్రజాభిమానం పొందిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. రాష్టాభివృద్ధికి తెరాస కట్టుబడి ఉందని, బంగారు తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు.