పిల్లలకు వచ్చే పోషకాహార లోపాలు సరిదిద్దే బాధ్యత అంగన్వాడీ ఆశా కార్యకర్తలపై ఉందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. జమ్మిచెడులో పోషణ్ అభియాన్‌పై అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్మన్ సరిత పాల్గొన్నారు. జిల్లాలో పోషకాహార లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అంగన్వాడీ ఆశా కార్యకర్తలతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
- ఇదీ చూడండి : బొమ్మకోసం 2 ఊళ్ల గొడవ.. నల్ల రంగుతో దాడులు