ETV Bharat / state

తెలంగాణలోనే ఏకైక శక్తిపీఠం.. అలంపూర్

ఆ దేవాలయం... దేశంలోని అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవది. తెలంగాణలోనే వెలసిన ఏకైక శక్తిపీఠం. అంతేకాదు దక్షిణకాశీగా ప్రఖ్యాతికెక్కిన పుణ్యక్షేత్రం. ఆలయంలో అడుగు పెట్టగానే ఆకట్టుకునే అద్భుత శిల్పకళ... అవి మన చరిత్రకు చెరిగిపోని సాక్ష్యాలు. నిత్యం వేలాది మంది సందర్శకులు.. సెలవు దినాల్లో పోటెత్తే పర్యటకులు. ఆ గుడి ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా... వెంటనే జోగులాంబ జిల్లాకు వెళ్లాల్సిందే.

తెలంగాణలోనే ఏకైక శక్తిపీఠం.. అలంపూర్
author img

By

Published : Aug 11, 2019, 7:09 PM IST

తెలంగాణలోనే వెలసిన ఏకైక శక్తిపీఠం. శ్రీశైల క్షేత్రానికి పశ్చిమద్వారం. అత్యంత ఆధ్యాత్మిక, చారిత్రక పర్యటక కేంద్రం అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం. అక్కడి నవబ్రహ్మ దేవాలయాలు.. భారతీయ సంసృతి, సంప్రదాయాలకు, వారసత్వ సంపదకు ప్రతీకలు. అలంపూర్ ఆలయనగరిని ఒకప్పుడు హలంపురం, హేమళపురం, హతంపురం అని పిలిచేవారు.

తెలంగాణలోనే ఏకైక శక్తిపీఠం.. అలంపూర్

అలంపూర్​ చరిత్ర

అష్టాదశ శక్తిపీఠాల్లో కొలువైన అమ్మవారి శరీరభాగాల్లో దవడ భాగం అలంపూర్​లో పడిందని చరిత్ర చెబుతుంది. అందుకే అక్కడ దేవి.. ఉగ్రరూపిణిగా దర్శనమిస్తారు. కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, బాల బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, గరుడ బ్రహ్మ, విశ్వబ్రహ్మ, పద్మ బ్రహ్మ, తారక బ్రహ్మ పేర్లతో శివాలయాలు అక్కడ వెలిశాయి. తెలంగాణలోని ఇతర శైవక్షేత్రాలకు ఈ దేవాలయ నిర్మాణాలు పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. ఒక్కో దేవాలయాన్ని ఒక్కో శైలిలో రూపొందించగా, కొన్నింటిలో శిల్పాలు చూపరులను కట్టిపడేస్తాయి.

అభివృద్ధి చేస్తే:

అలంపూర్​కు 2కిలోమీటర్ల దూరంలో పాపనాసి పేరిట మరో 23 దేవాలయాల సముదాయం దర్శనమిస్తుంది. పిరమిడ్ ఆకారంలోని చతురస్రాకార ఆలయశిఖరాలు ప్రత్యేక ఆకర్షణ. అంతేకాదు ఈ శక్తీపీఠంలో నిద్రిస్తే పాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. తెలంగాణ ప్రభుత్వం ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని సందర్శకులు, భక్తులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: జలదిగ్బంధంలో హిందూపూర్

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.