జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలంలోని అమరవాయిలో మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పర్యటించారు. మానవపాడు ఎంపీపీ అశోక్‌రెడ్డితో కలిసి గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
జిల్లాలో పత్తి, మిరప, ఉల్లి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని సంపత్‌కుమార్ ఆరోపించారు. ఎంత మేర పంట నష్టం జరిగిందని తెలుసుకోవడానికి ఇంతవరకూ అధికారులు రాకపోవడం దారుణమని విమర్శించారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. వెంటనే నష్టపోయిన పంటలను అంచనా వేసి.. రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమావేశం