ప్రాజెక్టుల వద్ద దీక్ష చేస్తున్న కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడం సరికాదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నెట్టెంపాడు ప్రాజెక్ట్ వద్ద ఒకరోజు దీక్ష చేయనున్న హస్తం పార్టీ నేతలను ముందస్తుగా అరెస్టు చేయడం సరికాదన్నారు.
రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలవుతున్నఇప్పటివరకు ప్రాజెక్టులు అసంపూర్తిగానే ఉన్నాయని... వాటిని పూర్తి చేయాలని దీక్ష చేస్తే అరెస్టు చేస్తారా అని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందన్నారు.
" నెట్టెంపాడు ప్రాజెక్టు వద్ద నిరసన చేయాలనుకున్న కాంగ్రెస్ నాయకులను... అర్ధాంతరంగా ఉదయం 5 గంటలకే పోలీసులు వచ్చి ఓ గజదొంగనో, తీవ్రవాది కూడా అలా అరెస్టు చేయరు నాకు తెలిసి. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున నిర్బంధం కొనసాగడం దురదృష్టకరం."
- సంపత్‌కుమార్, ఏఐసీసీ కార్యదర్శి