ETV Bharat / state

అక్రమార్కుల ఆగడాలు: ప్రైవేటు సర్వే నంబర్లు వేసి భూముల అమ్మకం - కొత్తపాలెంలో అక్రమంగా ప్రభుత్వ భూముల అమ్మకాలు

నిబంధనల మేరకు ప్రభుత్వ భూమిని విక్రయించటం నేరమే.. కొనటం నేరమే.. కానీ అక్రమార్కులు తెలివిగా వ్యవహరించారు. భూమి సర్వే నంబర్ మార్చారు. ఆ భూమికి సాదాబైనామా కాగితంలో ప్రైవేటు సర్వే నంబర్ వేశారు. అలా మార్చిన భూమిని కొంతమంది అక్రమార్కులు పట్టా భూమి అని చెప్పి దానిని ప్లాట్లు చేసి డబ్బులు మూటగట్టుకున్నారు. వారిపై బాధితులు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సాదా బైనామా కాగితంలో ఒక సర్వే నంబరు చూపించి, భూమిని మరొకచోట చూపించి ఒక ప్లాటును సుమారు రూ. 2 లక్షలకు అమ్మిన అక్రమార్కులపై 'ఈటీవీ భారత్​' ప్రత్యేక కథనం.

land
అక్రమార్కుల ఆగడాలు: ప్రైవేటు సర్వే నంబర్లు వేసి భూముల అమ్మకం
author img

By

Published : Dec 23, 2020, 4:57 PM IST

Updated : Dec 23, 2020, 5:19 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలం కొత్తపాలెం గ్రామంలో ఊరికి ఆనుకోని ఉంది ప్రభుత్వ భూమి. నిబంధనల మేరకు దాన్ని విక్రయించటం నేరమే కొనటం నేరమే. కానీ అక్రమార్కులు తెలివిగా వ్యవహరించారు. భూమి సర్వే నెంబర్ మార్చి ఆ భూమికి సాదాబైనామా కాగితంలో ప్రైవేటు సర్వే నంబర్ వేశారు. దాన్నే తమ సొంత భూమిగా వారసత్వపు ఆస్తిగా పేర్కొంటూ కొందరు పెద్దలు విక్రయించేశారు. కొన్న వారు సైతం ఇది పట్టాభూమే కాబట్టి ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చనే ఆలోచనతో భూమిని కొన్నారు. కొందరు తమ ప్లాట్లలో ఇళ్ల నిర్మాణం కూడా చేసుకున్నారు. తీరా అసలు విషయం ఆలస్యంగా పసిగట్టిన కొందరు యువకులు ఈ భూములపై ఆరా తీయటంతో అసలు సంగతి బయటపడింది. తాము కొన్నది పట్టాభూమి కాదని ప్రభుత్వ భూమి అని తెలిసి కొన్నవారు అవాక్కయ్యారు. ఈ మోసంపై కొందరు యువకులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారుల విచారణలో భూభాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ప్రభుత్వ భూమిని కొన్నవారికి రెవెన్యూ అధికారులు.. ఆ ప్లాట్లలో కట్టిన ఇళ్లు, ఇతర నిర్మాణాలు తొలగించాలని తాఖీదులు ఇచ్చారు. దీంతో కొన్న వారు తాము మోసపోయామని గ్రహించి సోమవారం జిల్లా కలెక్టర్​కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

land
మోసపోయామని జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేసిన కొత్తపాలెం వాసులు

సాగు భూమిని వదిలేసి కబ్జా

కొత్తపాలెం, దోర్నాల గ్రామాల శివారును, గ్రామాలను కలుపుతూ 131 సర్వే నంబర్​లో 17 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో గుడైం దొడ్డి జలాశయం నిర్మాణంతో పాటు రైతులకు సాగుకోసం ఇచ్చిన లావాణీ పట్టాలతో కలిపి 104.9 ఎకరాలు పోగా మిగిలిన భూమి 293.27 ఎకరాలు ఉంది. దీనిపై గ్రామంలో ఉన్న కొందరు పెద్దల(గద్దల) కన్ను పడింది. దీంట్లో కొంత భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించారు. అయితే ప్లాట్లు అమ్మే క్రమంలో అక్రమార్కులు తెలివిగా వ్యవహరించారు. ఊరికి 3 కి.మీ దూరంలో ఉన్న ప్రైవేటు భూములకు సంబంధించిన సర్వే నంబర్లను వేసి సాదా కాగితాలపై విక్రయించారు. ఈ విషయం 2013లో విక్రయించినట్లుగా కొనుగోలు దారుల వద్ద ఉన్న సాదా కాగితాల ద్వారా తెలిసింది. ఇలా 80 మందికి పైగా గ్రామస్థులు ఇళ్ల స్థలాలు కొన్నట్లు బయటపడింది.

ఒక్కో ప్లాటు రూ. 2 నుంచి 3 లక్షల వరకు ధర చేసి విక్రయించారు. కొన్న కొనుగోలు దారులు తమ సొంత ప్లాటే అని ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు. ఇప్పటి వరకు 30 మందికి పైగా ఇళ్లను కట్టుకున్నారు. తీరా ప్రభుత్వం.. స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చేపట్టిన క్రమంలో ఇళ్ల నమోదు కోసం వెళ్లిన కొనుగోలు దారులకు అసలు సంగతి బోధ పడింది.

అక్రమార్కుల ఆగడాలు: ప్రైవేటు సర్వే నంబర్లు వేసి భూముల అమ్మకం

నిరక్ష్యరాస్యులతో ఆటలు

ప్రభుత్వ భూమిలో ఇళ్ల నిర్మాణం చేసుకున్న విషయం అధికారులు గుర్తించారు. విచారణ చేపట్టి నిర్మాణం చేసుకున్న 23 మందికి తాఖీదులు సైతం ఇచ్చారు. చిత్రమేమిటంటే ప్లాట్లు కొన్న వారిలో కొంత మంది సాదాకాగితాల్లో వారు సాగు చేస్తున్న సొంత భూమి సర్వే నంబర్‌ను వేసి అమ్మారు. నిరక్షరాస్యులైన వారిని ఇలా మోసం చేసినట్లు తెలిసి గ్రామస్థులు వాపోతున్నారు. మరో విచిత్రమేమిటంటే కొనుగోలు దారులకు వేర్వేరు సర్వే నంబర్లు వేసి విక్రయించారు. ఈ క్రమంలో సొంత పట్టా భూములున్న ఇద్దరు రైతులకు చెందిన సర్వేనంబర్లను ఒకరిది మరొకరికి వేసి సాదా కాగితాలపై అమ్మారు. దీంతో కొన్న ఇద్దరు కొనుగోలు దారులు ప్రస్తుతం తలపట్టుకుని చేసేదేమి లేక సోమవారం.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ భూమికి ప్రైవేటు సర్వే నంబర్ వేసి విక్రయించింది వాస్తవమే. మా దృష్టికి రావటంతో విచారణ చేపట్టాం. ప్రైవేటు వ్యక్తులతో వారు కొన్నారు కాబట్టి మేము చర్యలు తీసుకోలేకపోయాం. కానీ ప్రభుత్వ భూమి ఆక్రమించిన వారి నుంచి మాత్రం తిరిగి తీసుకుంటాం. అమ్మిన వ్యక్తులపై కొనుగోలు దారులు చేసే ఫిర్యాదును బట్టి ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయి.

సుందర్ రాజు , ధరూరు తహసీల్దార్

ఇదీ చదవండి: అగ్రిగోల్డ్ ప్రమోటర్లకు రిమాండ్​.. చంచల్​గూడకు నిందితులు

Last Updated : Dec 23, 2020, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.