జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి సమీపంలోని దెయ్యాలవాగు వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గద్వాల నుంచి ఎర్రవల్లి వైపు అతివేగంతో వెళ్తున్న కారు చెరుకు లోడుతో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీ కొట్టింది. ఘటనలో కారులో ఉన్న ముగ్గురు యువకులు అక్కడిక్కక్కడే మృతి చెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గద్వాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం డ్రైవర్‌ను కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
మృతులు గద్వాలకు చెందిన విజయ్‌కుమార్, సునీల్, కిరణ్‌లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: కొత్త సంఘాల్లో ఓటర్ల జోరు .. హైదరాబాద్ శివారులో మారని తీరు