ETV Bharat / state

బాలబ్రహ్మేశ్వరుడి ఆలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం - aarudrostavam

జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా ఆరుద్రోత్సవం జరిగింది. స్వామి వారికి మహన్యాసపూర్వకంగా రుద్ర నమక చమకాలతో పంచామృత అభిషేకాలు చేశారు.

aarudrostavam in jogulamba balabrahmeshwara swamy temple
జోగులాంబ ఆలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం
author img

By

Published : Nov 5, 2020, 12:11 PM IST

శ్రీశైల మహా క్షేత్రానికి పశ్చిమ ద్వార క్షేత్రమైన అలంపూర్​ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో ఆరుద్రోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. శివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజున ఆరుద్రోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
బాల బ్రహ్మేశ్వరుడికి మహన్యాసపూర్వకంగా రుద్ర నమక చమకాలతో పంచామృత అభిషేకాలు చేశారు. సకల ప్రాణకోటికి క్షుద్భాధ తీరాలని అకాంక్షిస్తూ అన్నాభిషేకం చేశారు. బిల్వ దళాలతో అర్చించి దశ విధ హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకున్నారు.

ఇవీ చూడండి: రాజుల కాలపు వైభవాన్ని తలపించేలా.. యాదాద్రి క్షేత్ర రూపకల్పన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.