ETV Bharat / state

ఉమ్మడి పాలమూరుపై కొవిడ్​ పంజా.. ఒక్కరోజే 288 కేసులు - ఉమ్మడి పాలమూరు కరోనా తాజా వార్తలు

ఉమ్మడి పాలమూరుపై కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. వైరస్​ బారినపడుతోన్న బాధితుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో 288 కేసులు నమోదయ్యాయి. మరోవైపు అంతకంతకూ పెరుగుతోన్న కంటైన్​మెంట్​ జోన్లతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

288 new corona positive cases registered in joint mahabubnagar district
ఉమ్మడి పాలమూరుపై కొవిడ్​ పంజా.. ఒక్కరోజే 288 కేసులు
author img

By

Published : Aug 7, 2020, 7:47 AM IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 288 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 117 మంది వైరస్ బారినపడగా.. మహబూబ్‌నగర్​ జిల్లాలో 72, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 44, వనపర్తి జిల్లాలో 38, నారాయణపేట జిల్లాలో 17 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయింది.

గద్వాలలో..

జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా 117 కేసులు నమోదయ్యాయి. ఇందులో జిల్లా కేంద్రంలో 19, ఐజాలో 23, మానవపాడులో 21, అలంపూర్‌లో 17, ధూరులో 9, గట్టులో 8, మల్దకల్‌లో 6, ఇటిక్యాల, క్యాతూర్‌లలో ఆరుగురు చొప్పున వైరస్​ కోరల్లో చిక్కుకున్నారు. రాజోలిలో 4 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ..

పాలమూరులోనూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గురువారం జిల్లాలో 72 కేసులు నమోదయ్యాయి. ఇందులో జిల్లా కేంద్రంలోనే 53 మంది కొవిడ్ బారినపడ్డారు. పట్టణంలో రోజురోజుకూ కంటైన్​మెంట్‌ జోన్లు పెరుగుతుండటం వల్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది.

జడ్చర్ల పట్టణంలో 7, సీసీకుంట 3, నవాబుపేట 2, రాజాపూర్‌ 2, మూసాపేట, మిడ్జిల్‌, భూత్పూర్​, బాలానగర్‌, హన్వాడ, గండీడ్‌ మండలాల్లొ ఒక్కో కేసు నమోదయ్యాయి.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో..

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గురువారం 44 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలో 4, కల్వకుర్తిలో 10, అచ్చంపేటలో 7, బిజినేపల్లిలో 4, తాడూరులో 3, లింగాల, పెంట్వెల్లిలో ఇద్దరు చొప్పున.. వెల్దండ, వంగూరు, పెత్తకొత్తపల్లి, తిమ్మాజీపేటల్లో ఒక్కొక్కరు చొప్పున మహమ్మారి బారినపడ్డారు.

వనపర్తి జిల్లాలో..

వనపర్తి జిల్లాలో తాజాగా 38 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. జిల్లా కేంద్రంలోనే 22 మందికి వైరస్​ సోకింది. పెద్దమందడిలో 5, ఆత్మకూరులో 3, పెబ్బేరు, అమరచింతల్లో ఇద్దరు చొప్పున కొవిడ్‌ బారినపడ్డారు. కొత్తకొట, శ్రీరంగాపురం, గోపాల్‌పేట, చిన్నంబావిలో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదైంది.

నారాయణపేట జిల్లాలో..

నారాయణపేట జిల్లాలో 17 కేసులు నమోదు కాగా.. ఇందులో జిల్లా కేంద్రంలో 7 కేసులు, ఉట్కూరులో 5, కోస్గి మండలం భక్తిమళ్లలో 2, మరికల్‌, నారాయణపేట, ధన్వాడ మండలాల్లో ఒక్కో పాజిటివ్​ కేసు నమోదైంది.

ఇదీచూడండి: అశ్రునయనాల నడుమ ముగిసిన సోలిపేట అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.