ETV Bharat / state

నాలుగో తరగతి చదివాడు.. చేపల పట్టే యంత్రం తయారు చేశాడు. - చేపలు పట్టే యంత్రాన్ని తయారు చేసిన చంద్రశేఖర్

Fishing Machine: అతను చదువుకున్నది నాలుగో తరగతి ..కానీ తయారు చేసిన పరికరంతో వాగులో చేపలు పట్టే వినూత్న పరికరాన్ని తయారు చేశాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ.. తాను ఉపాధి పొందడంతో పాటు.. మరో నలుగురికి ఉపాధి కల్పించాడు.

fish
fish
author img

By

Published : Jan 23, 2023, 8:05 PM IST

చేపలు పట్టే యంత్రాన్ని తయారు చేసిన చంద్రశేఖర్

Younger Talent In Bhupalapalli: కృషి ఉంటే మనుషులు.. బుషులు అవుతారు అనే మాట వాస్తవం చేస్తూ.. టాలెంట్​ ఉంటే పెద్దపెద్ద చదువులు చదవాల్సిన పనిలేదు.. టాలెంట్​ను ఉపయోగించి ఎవరికీ చేతకాని పనిని చేసి చూపించవచ్చు అని చాటి చెప్పి.. మరి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. నలుగురికి ఉపాధిని కల్పించాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన ముక్కెర చంద్రశేఖర్ చిన్ననాటి నుంచే ఎలక్ట్రిషియన్ చిన్న చిన్న మరమ్మతులు చేసేవాడు.

స్వతహాగా టీవీల మరమ్మతులు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో చేపలు పట్టేందుకు ఇబ్బంది పడుతున్న గ్రామస్థులను చూసి ఓ పరికరం తయారు చేయాలనుకున్నాడు. అంతర్జాలాన్ని వేదికగా చేసుకొని.. అందులో విభిన్న వీడియోలను చూస్తూ.. తన ప్రతిభకు పదును పెట్టారు. బ్యాటరీ ద్వారా పనిచేసే పరికరాన్ని రూపొందించారు. పురుగు మందు పిచికారీ చేసే డబ్బాకు ఈ పరికరాన్ని అమర్చాడు. పరికరం ద్వారా వచ్చే తీగలను రెండు పొడవైన వెదురు పుల్లల ద్వారా నీటి ప్రవాహంలో ఉంచి నీటిలో చేపలను 'బెల్ బటన్ సాయంతో మూర్చపోయేలా చేస్తాడు.

పరికరాన్ని పట్టుకున్న వారు నీటిలోనే ఉన్నప్పటికి ఎలాంటి విద్యాదాఘాతానికి గురికాకుండా ఏర్పాటు చేశాడు. రెండేళ్లపాటు అనేకసార్లు ప్రయోగించిన తర్వాత పరికరాన్ని మన్నికగా మలిచారు. పరికరం సాయంతో స్థానికంగా వాగులు, వంకలు చెరువుల్లో చేపడుతూ వాటిని విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. బ్యాటరీ, ఇతర పరికరాలకు రూ.11,500 ఖర్చయిందని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తే మరిన్ని పరికరాలు తయారు చేస్తానని చెబుతున్నారు.

"విద్యుత్ ఉపయోగించి చేపకు ఏం కాకుండా.. మనిషికి ఎలాంటి హాని జరగకుండా ఏదైనా ఒక వస్తువు తయారు చేద్దాం అనుకున్నాను. యూట్యూబ్​ను ఓపెన్​ చేస్తే దానిలో కొన్ని వీడియోలు చూశాను. అదే ఉద్దేశంగా తీసుకొని విద్యుత్​ కాబట్టి ఎవరు ఎలాంటి హాని కలుగకుండా ఈ పరికరం కనుగొనడం జరిగింది. రెండు సంవత్సరాలు దీనిని తయారు చేసుకుంటూ దీనితోనే మళ్లీ టెస్టింగ్​ చేసుకుంటూ.. ఇది ఏ విధంగా పనిచేస్తుంది. దీనిలో ఇంకా ఏమి తక్కువ ఉన్నాయి. ఇంకా ఏమి చేయాలని.. దీనిలో అవకతవకలు లేకుండా చూసుకొని ఇప్పుడు 100శాతం పూర్తి చేశాను. ఇటువంటి వాటిపై పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు. ప్రభుత్వం సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఆవిష్కరణలు మరెన్నో చేయడానికి అవకాశం కల్పిస్తారని భావిస్తున్నా." - చంద్రశేఖర్​, పరికరం తయారీదారుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.