జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఒడితల గ్రామ శివారు చెరువులో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని అలుగుల ఒదేలుగా గుర్తించారు.
మూడు రోజుల క్రితం...
ఓదెలు మూడు రోజుల కిందట చెరువు వద్దకు వెళ్లినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు ఆయన చెరువులో పడిన విషయాన్ని ఎవరూ గమనించలేదు. ఫలితంగా ఓదెలు మృతి చెందాడు. ఆదివారం మృతదేహం నీటిపై తేలినట్లు గ్రామస్తులు గుర్తించారు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చిట్యాల పోలీసులు వెల్లడించారు.