జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. భూపాలపల్లిలోని 11 మండలాల్లో తెల్లవారు జాము నుంచి ఎడతెరిపిలేకుండా వాన కురుస్తుండగా వాహనదారులు కొంత ఇబ్బందిపడ్డారు.
భూపాలపల్లి, గణపురం, రేగొండ, చిట్యాల టేకుమాట్లా, మొగుళ్లపల్లి, కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హల్రావు, పాలిమల మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవగా అక్కడక్కడ చెరువులు నిండుతున్నాయి. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందిపడ్డారు.