కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని వరుస క్రమంలో ఉన్న ఒకటో పంపుకు ఈరోజు ఇంజినీర్లు ట్రయల్ రన్ నిర్వహించారు. ఒక్కో పంపుకు సుమారుగా 12 సార్లు ట్రయల్ రన్ నిర్వహిస్తారు. 231 ఆర్పీఎంలో పంపు రన్ అయితే విజయవంతమైనట్లు భావిస్తారు. ఈ క్రమంలో ఒకటో పంపుకు చివరి రన్ నిర్వహించడం ద్వారా భారీగా గ్రావిటీలోకి గోదావరి జలాలు చేరాయి. ట్రయల్ రన్ సుమారుగా ముప్పావుగంట జరిగింది. పంప్‌ల ద్వారా చేరిన నీరు గ్రావిటీ కెనాల్ గుండా ప్రవహించి అన్నారం బ్యారెజీకి చేరింది.
ఇవీ చూడండి: పుర'పోరు'కు రంగం సిద్ధం