Trader cheated Farmers in Telangana : రైతులు ప్రతి రోజు కష్టపడి పంటను పండించారు. ఓ వ్యక్తి అధిక ధర చెల్లిస్తానని మాయ మాటలు చెప్పడంతో ఆశపడిన రైతులు ఆ వ్యక్తికి వారు పండించిన పత్తిని అమ్మారు. డబ్బులు విషయం వచ్చేసరికి వాయిదాల ప్రకారం ఇస్తానని నమ్మించాడు. దీంతో వాయిదా తేదీ వచ్చే సరికి ఇంట్లో వ్యక్తి లేడు, వారు పండించిన పంటా లేదు. మోసపోయామని తెలుసుకున్న రైతులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన పత్తి వ్యాపారి సురాబు శంకర్ రావు చుట్టు పక్కల గ్రామాల నుంచి వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలు క్రమవిక్రయాలు చేస్తూ ఉండేవాడు. ఇదే క్రమంలో మొగుళ్లపల్లి, రేగొండ మండలాల్లోని పత్తి రైతులకు అధిక ధర చెల్లిస్తానని చెప్పి పంటను కొనుగోలు చేశాడు. దీంతో నాలుగు రోజులు క్రితం నుంచి ఆ వ్యాపారి కుటుంబ సభ్యులతో సహా గ్రామంలో కనిపించలేదు. వ్యాపారికి ఫోన్ చేస్తే అవ్వలేదు.
Farmers Protest in Telangana : ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రోడ్డెక్కిన రైతాంగం
Farmers problems in Telangana : దీంతో ఆందోళన చెందిన కర్షకులు.. అతని గురించి వెతకసాగారు. ఎంతకీ ఆచూకీ దొరకలేనందున మోసపోయామని తెలుసుకున్నారు. సుమారు 3 కోట్ల రూపాయల వరకు మోసం చేశాడని ఆరోపించారు. ఇంకా పలువురు మహిళలు, రైతుల వద్ద నగదు అప్పుగా తీసుకొని.. వారికి చెల్లించలేదని గ్రహించిన రైతులు నమ్మి మోసపోయామని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. సురాబు శంకర్రావుపై రైతులు ఫిర్యాదు చేశారు. వ్యాపారిని అరెస్ట్ చేసి.. తమ డబ్బులు ఇప్పించాల్సిందగా పోలీసులను అన్నదాతలు కోరారు.
"సురాబు శంకర్రావుకి 45 క్వింటాళ్ల 60 కేజీలు కాటా పెట్టాను. నాకు నిందితుడు దగ్గర నుంచి వచ్చే నగదు రూ.85,000. వాయిదా ప్రకారం ఇస్తానని చెప్పాడు. వాయిదా తేదీ వచ్చేసరికి ఇంటి దగ్గర లేడు. నేను కష్టపడి పంట పండించి అతనికి ఇస్తే.. ఇప్పటికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. నాకే కాదు నాలానే ఎవ్వరికీ డబ్బులు చెల్లించలేదు." - కిషన్ , బాధిత రైతు
"నా సొంత భూమి నాలుగు ఎకరాలు, మరో రెండు ఎకరాలు కౌలుకి తీసుకుని పంట పండించాను. దాదాపు 175 కిలోల మొక్కలు పండించాను. పంట పండించేందుకు ప్రతి రోజు కష్టపడ్డాను. నాకు బాగా నమ్మంకంగా ఉంటాడని అనుకోని పంట తన చేతికి ఇస్తే.. మమ్మల్ని మోసం చేశాడు. అందరి దగ్గర దొరికినంత దోచుకున్నాడు. పోలీసులకు ఈ విషయం తెలియజేశాం. వారి వెంటనే నిందితుడ్ని పట్టుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం."- ఆనంద రెడ్డి, బాధిత రైతు
ఇవీ చదవండి :