జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. ఆకినపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన.. విశ్రాంత అడిషనల్ ఎస్పీ కట్టంగూరి రాం నరసింహారెడ్డి పదవి విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నరసింహారెడ్డి దంపతులను.. ఘనంగా సత్కరించారు.
కేఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా నరసింహారెడ్డి చేపడుతోన్న పలు సేవా కార్యక్రమాలను మంత్రి కొనియాడారు. పదవి విరమణ అనంతరం కూడా ప్రజల మధ్యలో ఉండి.. సేవలు అందించాలని ఆయన కోరారు. ప్రజలకు సేవ చేయాలనే మంచి మనసున్న మనిషి.. రాజకీయాల్లోకి రావాలని సూచించారు.
ఇదీ చదవండి: విధి నిర్వహణలో ఏఎస్ఐ మృతి... అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు