కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజి గేట్లను ఇంజినీరింగ్ అధికారులు ఎత్తి ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి, ప్రాణహిత నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజి వద్ద నీటిమట్టం పెరిగే అవకాశం ఉండడం వల్ల అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. బ్యారేజిలో ప్రస్తుతం 6.3 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరుస క్రమంలోని 35 నుంచి 65 వరకు ఉన్న గేట్లను నాలుగు మీటర్ల మేర ఎత్తి ఉంచారు. మేడిగడ్డ నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇవీ చూడండి: బ్రేకింగ్ న్యూస్: "కాఫీ డే" సిద్ధార్థ మృతి