Annaram Pump House Fourth Pump Ready: కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం పంప్‌హౌస్‌లో నాలుగో పంప్ కూడా పునఃప్రారంభమైంది. ఇటీవలి గోదావరి వరదల్లో అన్నారం, కన్నేపల్లి పంప్‌హౌస్‌లు నీట మునిగాయి. గుత్తేదారు ఖర్చుతోనే పంప్‌హౌస్‌లను పునరుద్ధరిస్తూ పంపులకు అవసరమైన మరమ్మతులు చేస్తున్నారు. మరమ్మతులు పూర్తి చేసి ఇప్పటికే మూడు పంపులను పునఃప్రారంభించారు.
తాజాగా సోమవారం రాత్రి నాలుగో పంపు కూడా పునఃప్రారంభమైంది. పంపు పూర్తి సామర్థ్యంతో నీటిని ఎత్తిపోసినట్లు ఇంజినీర్లు తెలిపారు. మిగతా పంపులను కూడా దశల వారీగా పునరుద్ధరిస్తామని, కన్నేపల్లి పంప్ హౌస్‌లోనూ త్వరలోనే పంపులను ప్రారంభిస్తామని ఇంజినీర్లు వెల్లడించారు.
ఇవీ చూడండి..