ETV Bharat / state

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కారకులను వదిలిపెట్టేదేలే : మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి - ఇంజినీర్లకు మంత్రి ఉత్తమ్​ హెచ్చరిక

Telangana Government Action on Medigadda Barrage : మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు విషయంలో ఇంజినీర్లు, ఎల్​అండ్​టీ సంస్థ ప్రతినిధులు చర్చించి తదుపరి కార్యాచరణపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓ వైపు న్యాయవిచారణకు సిద్ధమవుతున్న సర్కార్ మరోవైపు వీలైనంత త్వరగా కాపర్ డ్యాం నిర్మాణంతో పాటు విచారణ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది.

Uttam kumar Meeting with L and T Engineers
CM Instructions on Medigadda Barrage Damage
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 19, 2023, 7:37 AM IST

మేడిగడ్డ విషయంలో ఏదో ఒక లెటర్ ఇచ్చి ప్రమేయం లేదంటే ఊరుకోం ఉత్తమ్​కుమార్​ రెడ్డి

Telangana Government Action on Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్ట కుంగిన అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణ వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జ్‌(Sitting Judge Hearing on Medigadda Damage)తో న్యాయవిచారణ జరిపించి బాధ్యులను చట్టపరంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగా సీఎం సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఆనకట్టకు సంబంధించి తదుపరి కార్యాచరణ కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం సూచించారు.

మేడిగడ్డ మరమ్మతుల భారాన్ని తాము భరించబోమని ఎల్​అండ్​టీ(L&T Reaction on Medigadda Damage) స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ సంస్థ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. వారితో పాటు నీటిపారుదలశాఖ ఇంజినీర్లతో మంత్రి ఉమ్మడి సమావేశం నిర్వహించి అన్ని అంశాలపై లోతుగా సమీక్షించారు. మేడిగడ్డ ఆనకట్ట డిజైన్‌పై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు.

కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తి వివరాలు అందించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Irrigation Minister Fire on Representatives of L&T : నీటిపారుదలశాఖ ఇచ్చిన డిజైన్ ఆధారంగా తాము నిర్మాణం చేశామని ఎల్ అండ్ టీ ప్రతినిధులు చెప్పారు. ఇంజినీర్లు రూపొందించిన డిజైన్లను ఎవరైనా పరిశీలించారా అని మంత్రి ఈఎస్​సీలను ప్రశ్నించారు. అంత పెద్ద ఆనకట్ట డిజైన్‌ను థర్డ్ పార్టీ తనిఖీ చేయకుండా ఎలా నిర్మిస్తారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Fire on L&t Representative) నిలదీశారు. ఇసుకపై భారీ నిర్మాణం ఎలా నిలుస్తుందని అనుకున్నారని ప్రశ్నించారు. ఇంజినీర్లకు బాధ్యత లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్‌ను ఏ మాత్రం పరిశీలించకుండా నిర్మాణం ఎలా చేపట్టారని ఎల్​అండ్​టీ ప్రతినిధులను మంత్రి ఉత్తమ్ అడిగారు.

మేడిగడ్డ నిర్మాణ అంశంలో ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి తమ ప్రమేయం లేదని తప్పించుకోవాలని చూస్తే ఊరుకోబోమని ఉత్తమ్​కుమార్​ హెచ్చరించారు. ఘటన జరిగి రెండు నెలలవుతుందని ఇప్పటి వరకు ఏం తేల్చారని ప్రశ్నించారు. ఈ దిశగా అప్పటి ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని ఆయన సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

'మేడిగడ్డ' ఘటనలో ఊహించని ట్విస్ట్ - పునరుద్ధరణ బాధ్యత ప్రభుత్వానిదే అంటూ నిర్మాణ సంస్థ లేఖ

Uttam kumar Meeting with L and T Engineers : భారీ శబ్దం వచ్చిన తర్వాతే కుంగిపోయిందని దీంతో పియర్స్ ఫౌండేషన్ దెబ్బతిని ఉండొచ్చని ఎల్​అండ్​టీ ప్రతినిధులు వివరించారని తెలుస్తోంది. ఆ అంచనా సరికాదని నీటిపారుదలశాఖ ఇంజినీర్లు విభేదించినట్లు సమాచారం. కాపర్ డ్యాం నిర్మాణంతో పాటు మరమ్మతులకు రూ.800 కోట్ల వరకు వ్యయం కావచ్చని సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. తక్షణమే కాపర్‌డ్యాం పనులు(Copper Dam Works at Medigadda Barrage) ప్రారంభించాలని వీలైనంత త్వరగా విచారణ ప్రక్రియ చేపట్టాలని అటు సంస్థ ప్రతినిధులకు, ఇంజినీర్లను మంత్రి ఆదేశించారు. వీటితో పాటు మరమ్మతుల కార్యాచరణపై దృష్టి సారించాలని వారికి స్పష్టం చేశారు.

Uttam kumar Suggest to Start Copper Dam : రెండు వైపులా అన్ని అంశాలను చర్చించుకొని తన వద్దకు రావాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంస్థ ప్రతినిధులకు తెలిపారు. న్యాయవిచారణ చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారని ప్రజాధనాన్ని వృథా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని మంత్రి హెచ్చరించారు. అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు నిర్మించిన గుత్తేదార్లను కూడా పిలిచి మాట్లాడాలని ఆ జలాశయాలను కూడా ఖాళీ చేసి పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు.

మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయిస్తాం : రేవంత్‌రెడ్డి

వర్షాకాలంలోగా మేడిగడ్డ పునరుద్ధరణ కష్టమే - ఆందోళనలో నీటిపారుదల శాఖ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.