ETV Bharat / state

భూసేకరణ పరిధి సడలించేందుకు సుప్రీం అనుమతి

భూపాలపల్లి జిల్లా కాకతీయ గని-2పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సింగరేణి యాజమాన్యం పర్యావరణ నిబంధనలు పాటించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. భూసేకరణ పరిధి సడలించేందుకు న్యాయస్థానం అంగీకరించింది.

author img

By

Published : Sep 5, 2019, 4:25 PM IST

సుప్రీం

బొగ్గు గనుల విషయంలో పర్యావరణ నిబంధనలు పాటించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టీకరించింది. భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ గని-2 వద్ద భూసేకరణ పరిధి సడలించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. 500మీటర్ల నుంచి 150 మీటర్లకు సడలిస్తూ కేంద్రపర్యావరణశాఖ నిబంధనలకు అనుమతినిచ్చింది. స్థానిక ప్రజాభద్రత విషయంలో రాజీవద్దని గుర్తు చేసింది ధర్మాసనం. గతంలో కాకతీయ గని-2 భూసేకరణ సడలింపు నిబంధనలను ఎన్జీటీ కొట్టేసింది. ఈ విషయమై సింగరేణి సుప్రీంలో సవాలు చేసింది.

భూసేకరణ పరిధి సడలించేందుకు సుప్రీం అనుమతి

ఇవీ చూడండి : లక్షల్లో లావాదేవీలు... కోట్లలో స్వాహా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.