ETV Bharat / state

కొడవటంచలో వైభవోపేతంగా రథోత్సవం - rathothsavam in kodavatancha

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు తెల్లవారుజామున రథోత్సవం వేడుకతో ఆలయ అర్చకులు జాతరను ప్రారంభించారు.

kodavatancha festivities
కొడవటంచ జాతర
author img

By

Published : Mar 29, 2021, 10:01 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం తెల్లవారుజామున స్వామి వారిని రథంపై ఊరేగించి వేడుకలను ప్రారంభించారు. ఆలయ ప్రధానార్చకుడు బుచ్చమాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు స్వామి ఉత్సవ విగ్రహాలను రథంపై పెట్టి పుర వీధుల్లో భక్తుల కోలాటాల మధ్య అంగరంగ వైభవంగా ఊరేగించారు.

రథాన్ని లాగటానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు పోటీ పడ్డారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వేడుకల్లో పాల్గొని రథాన్ని లాగారు. అనంతరం ఆలయం చుట్టూ బోనాలు, ఎడ్ల బండ్లు, వాహనాలతో ప్రదక్షిణలు చేశారు.

ఇదీ చదవండి: రంగుల హోలీ పండుగ విశిష్టత తెలుసుకుందామా.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.