జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కోటగుళ్లులోని గణపేశ్వర ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలు నిర్వహించారు. అమావాస్య పర్వదిన్నాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు.
ఆలయానికి వచ్చిన భక్తులతో పాలాభిషేకం చేయించారు. నేటితో ఆషాడం ముగిసి రేపటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుందని అర్చకులు భక్తులకు తెలిపారు. వాటి విశిష్టతలను తెలియజేశారు. కానీ కరోనా సమయంలో భక్తులు మాస్కులు లేకుండా సామాజిక దూరం పాటించకుండా రావడం కాస్త ఆందోళన కలిగించే విషయమే.
ఇవీ చూడండి: బిహార్లో పిడుగుల బీభత్సం.. 16 మంది మృతి