మాజీ ఎంపీ కవిత సాయంతో ఓ కుమారుడు తన తండ్రిని కడసారి చూసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌కు చెందిన చిలువేరు సాంబయ్య గురువారం రోజు అనారోగ్యంతో మృతి చెందాడు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉద్యోగం చేస్తోన్న సాంబయ్య కుమారుడు రామకృష్ణ... ఈ విషయాన్ని అక్కడి కలెక్టర్, అధికారులకు విన్నవించాడు. లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా... ఒడిశా అధికారులు రామకృష్ణకు అనుమతివ్వలేదు.
ఈ మేరకు రామకృష్ణ స్నేహితుడు, భూపాలపల్లి టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి స్పందించి మాజీ ఎంపీ కవితతో ఫోన్లో మాట్లాడారు. ఒడిస్సా ప్రభుత్వంతో చర్చించిన కవిత రామకృష్ణకు అనుమతి ఇప్పించారు. శనివారం తెల్లవారుజామున రామకృష్ణ స్వగ్రామం చేరుకుని తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశాడు. తండ్రి అంతిమ సంస్కారాలు చేయడానికి అనుమతిప్పించిన మాజీ ఎంపీ కవితకు, సహకరించిన మాడ హరీశ్‌రెడ్డికి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.