జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన వనంయాది, భద్రమ్మ దంపతుల కూతురు సంధ్య గర్భిణీ కావడంతో.. పురిటి నొప్పులతో ఇంటి వద్ద బాధపడుతుంది. హాస్పిటల్కు తీసుకెళ్లేందుకు ఎలాంటి వాహనాలు అందుబాటులో లేవు. ఈ విషయాన్ని సంధ్య తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐ నిహారికకు చెప్పడంతో ఆమె సకాలంలో స్పందించారు.
స్వయంగా పోలీసు వాహనంలో బాధితురాలు సంధ్యను, కుటుంబ సభ్యులను ఇంటి వద్ద నుండి ఎక్కించుకొని చిట్యాల సివిల్ హాస్పిటల్కు తీసుకెళ్లి అడ్మిట్ చేసింది. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆమె వెంట కానిస్టేబుల్ భిక్షపతి, ఆశ కార్యకర్త స్వప్న, సంధ్య కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఇదీ చూడండీ: 'ఊరురా అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి'