జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులు ఆందోళనబాట పట్టారు. సంగారెడ్డి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న పంచాయతీ కార్యదర్శి జగన్నాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ విధులు బహిష్కరించారు. జయశంకర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జగన్నాథ్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆరోపించారు. తమపై ఉన్న ఒత్తిడికి జగన్నాథ్ ఆత్మహత్యే నిదర్శనమని, ఇప్పటికైనా పని భారం తగ్గించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.