జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారంలో గత రెండు నెలల క్రితం హత్యకు గురైన రాజబాబు కుటుంబాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పరామర్శించారు. ఎస్సీ కమిషన్ తరఫున 4,12,500 రూపాయల చెక్కును రాజబాబు భార్యకు అందజేశారు.
రేవెళ్లి రాజబాబు హత్య బాధాకరమన్నారు. మృతుడి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. రాజబాబు కుటుంబానికి ఒక డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరయ్యే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ జక్కు శ్రీ హర్షిని, పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుకర్ పాల్గొన్నారు.