ముప్పై రోజుల ప్రణాళికలో పనులు చేయడానికి డబ్బుల్లేక నగలను కుదువ పెట్టాల్సి వస్తోందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా మహాముత్తారం మండలం మాదారం సర్పంచి ఈ విషయాన్ని వాట్సప్‌లో మండల పరిషత్ అధికారి దృష్టికి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన పనులు చేయించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని, వాటి కోసం ముత్తూట్ ఫైనాన్స్‌లో నగలను తాకట్టు పెట్టి 60 వేల తీసుకున్నట్లు ఆధారాలను కూడా జతచేసి పోస్టు చేశారు. ఈ విషయంపై వెంటనే స్పందిన ఎంపీడీఓ అంజనేయులు పంచాయతీ ఏఈలు, నీటిసరఫరా ఇంజినీర్లు, ప్రజాప్రతినిధులు చేసిన పనులకు సంబంధించి బిల్లులు వెంటనే రికార్డు చేసి పంపించాలని ఆదేశించారు. రికార్డులు వచ్చిన వెంటనే డబ్బును అందిస్తామని వివరించారు.
ఇవీ చూడండి: నీలోఫర్ క్లినికల్ ట్రయల్స్‌పై విచారణకు ఆదేశం