ETV Bharat / state

Flood Effect: వరదల్లో కొట్టుకుపోయిన పశువులు.. పూర్తిగా ధ్వంసమైన రహదారులు - రోడ్లు

Roads Damage: తెలంగాణలోని పలు జిల్లాల్లో వరదలకు సర్వం కోల్పోయిన బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంట్లోని వస్తువులు తడిసిపోవటమేకాక పశువులు, కోళ్లు కొట్టుకుపోయాయి. పంటలు నీటి మునిగాయి. చాలాప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినటంతో రాకపోకలు నిలిచిపోయాయి. తమను ఆదుకోవటంతోపాటు సహాయక చర్యలు చేపట్టాలని బాధిత ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Roads Damage
Roads Damage
author img

By

Published : Jul 18, 2022, 8:57 PM IST

భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన పశువులు.. పూర్తిగా ధ్వంసమైన రహదారులు

Roads Damage: భారీ వర్షాలకుతోడు గోదావరి వరదలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలు నానాకష్టాలు పడుతున్నారు. పలిమెల, పంకన, లెంకలగడ్డ, నీలంపల్లి, సర్వాయిపేట, దమ్మూరు, ముకునూరు గ్రామాల్లోకి వరద ముంచెత్తడంతో కట్టుబట్టలతో ఊళ్లు వదిలిపోయారు. వరద తగ్గటంతో ఇళ్లకు చేరుకుంటున్న బాధితులు.. ఉన్నదంతా పోవటంతో గుండెలు బాదుకుంటున్నారు. ఇంట్లోని సామగ్రి తడిసిపాడవటంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పశువులు, కోళ్లు కొట్టుకుపోయాయి. సుమారు 2 వేల ఎకరాల్లోని పత్తి పంటలు నీట మునిగాయి. పెద్దంపేట వాగు వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు ధ్వంసం కావడం పలిమెల మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి.

ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు కామారెడ్డి జిల్లాలో రోడ్లు దెబ్బతిన్నాయి. వరద ఉద్ధృతికి చాలాచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. జిల్లావ్యాప్తంగా వర్షాలకు 52.85 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు ధ్వంసం కాగా రూ.13 కోట్ల మేర నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. 44 కిలోమీటర్ల మేర ఆర్‌ అండ్‌ బీ రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మద్నూర్ నుంచి జుక్కల్ మండలానికి 20 కోట్లతో రెండేళ్లక్రితం వేసిన రోడ్డుకు పగుళ్లు ఏర్పడ్డాయి. మరికొన్నిచోట్ల వర్షాలకు రోడ్డుపక్కన మొరం కొట్టుకుపోయింది. జుక్కల్ మండలం హంగర్గ సమీపంలో వర్షానికి కల్వర్టు కొట్టుకుపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. మద్నూర్ మండలం సిర్పూర్ వాగుపై 35 లక్షలతో నిర్మించిన వంతెన వరదలకు కొట్టుకుపోయింది. మద్నూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, పెద్ద కొడప్‌గల్ మండలాల్లో రోడ్లు దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వరద బాధిత ప్రాంతాల ప్రజల కోరుతున్నారు.

ఇవీ చదవండి: కట్టిపడేస్తోన్న 'పాకాల' అందాలు.. మది పరవశించే రమణీయ దృశ్యాలు

నీట్ పరీక్షలో విద్యార్థినులకు ఇబ్బందులు.. లోదుస్తులు తీసేస్తేనే ఎంట్రీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.