ETV Bharat / state

ప్రణబ్​ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటు: ఎమ్మెల్యే గండ్ర

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పేర్కొన్నారు. తన క్యాంపు కార్యాలయంలో ప్రణబ్​ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు.

Pranab Mukherjee's death is a huge loss to the country: MLA Gandra
ప్రణబ్​ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటు: ఎమ్మెల్యే గండ్ర
author img

By

Published : Sep 1, 2020, 12:49 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారత రత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి ఆయన​ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.

ప్రణబ్ ముఖర్జీ మరణం యావత్​ దేశానికి తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ప్రభుత్వ చీఫ్ విప్​గా ఉన్నప్పుడు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో తనను ఎలక్షన్​ ఏజెంట్​గా నియమించుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆయన కోసం పని చేసే అవకాశం కల్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి, వరంగల్ రూరల్ జడ్పీ ఛైర్​పర్సన్​ గండ్ర జ్యోతి రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీచూడండి.. ' వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగడం సంతోషకరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.