ETV Bharat / state

గోదావరి సరిహద్దులో పోలీసుల వేట.. కంకణాల లక్ష్యంగా కూంబింగ్ - మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి

గోదావరి సరిహద్దుల్లో మళ్లీ పోలీసుల కూంబింగ్‌ కొనసాగుతోంది. ఈసారి ప్రాంతం.. లక్ష్యం మారాయి. మొన్నటి వరకు ఆసిఫాబాద్‌ జిల్లా అడవుల్లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ కోసం జరిగిన వేట.. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా అడవుల్లో మరో రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి కోసం సాగుతోంది.

police cumbing at Godavari border
గోదావరి సరిహద్దులో పోలీసుల వేట
author img

By

Published : Nov 13, 2020, 8:03 AM IST

గోదావరి సరిహద్దుల్లో మళ్లీ పోలీసుల కూంబింగ్‌ కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని మహదేవ్‌పూర్‌ మండలం పెద్దంపేట, పలిమెల మండలం లెంకలగడ్డ ప్రాంత అడవుల్లో 8-10 మందితో కూడిన మావోయిస్టుల బృందం పోలీసు బలగాలకు తారసపడింది. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినా ప్రాణనష్టం సంభవించలేదు.

ఆయా ప్రాంతాల్లో రాజిరెడ్డితో పాటు లోకల్‌ ఆర్గనైజింగ్‌ స్క్వాడ్‌(ఎల్‌వోఎస్‌) కమాండర్‌ భద్రుతో కూడిన బృందం సంచరిస్తోందనేది తేzతెల్లమైంది. వీరు గోదావరి సరిహద్దుల్లో తీరం దాటేందుకు మర పడవల్ని వినియోగించే అవకాశం ఉండటంతో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని ఫెర్రీ పాయింట్ల(పడవల్ని నిలిపి ఉంచే ప్రాంతాలు)పై నిఘా ఉంచాయి.

అహెరీ- నేషనల్‌ పార్క్‌ - బీజాపూర్‌

ఆసిఫాబాద్‌ జిల్లా మంగీ అటవీప్రాంతంలోనే ఆర్నెల్లుగా మకాం వేసి ఆరు ఎన్‌కౌంటర్లలో తప్పించుకున్న భాస్కర్‌ తీరం దాటినట్లు నిఘావర్గాలు భావిస్తున్నాయి. భాస్కర్‌ బృందం ప్రాణహిత దాటాక మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహెరీ తాలూకా ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించే మావోయిస్టు అస్థి దళం సహకారం తీసుకున్నట్లు అంచనా వేశాయి. అక్కడి నుంచి మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని ఇంద్రావతి నదిని దాటేందుకు ఇంద్రావతి నేషనల్‌ పార్కు ప్రాంతదళం సహకరించి ఉంటుందనేది నిఘావర్గాల అనుమానం. అలా భాస్కర్‌ మంగీ అడవుల నుంచి బీజాపూర్‌ చేరుకుని ఉంటాడని నిఘా విభాగంలోని ఓ అధికారి చెప్పారు. భద్రాద్రి, ములుగు అడవుల్లో ఇన్నాళ్లూ సంచరించిన మరో రాష్ట్రకమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌ సైతం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి ఉంటాడని నిఘావర్గాల భావన. ఈక్రమంలో వెంకటేశ్‌ బృందం మాత్రమే భూపాలపల్లి అడవుల్లో సంచరిస్తున్నట్లు గ్రహించి అతని కోసం కూంబింగ్‌ను విస్తృతం చేశాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.