జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ ప్రధాన రహదారి వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. రోడ్డు భద్రత నిబంధనలు అతిక్రమించి లారీలు నడిపితే కేసు నమోదు చేస్తామని.. లారీ యజమానులను భూపాలపల్లి ఎస్సై ఉదయ్ కిరణ్ హెచ్చరించారు. అధిక లోడుతో నడుపుతున్న లారీని అదుపులోకి తీసుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు అప్పగించినట్లు తెలిపారు.
జసీఐ వాసుదేవరావు ఆదేశాలతో సోదాలు చేపట్టనట్లు ఎస్సై తెలిపారు. తనిఖీల్లో ఇద్దరు శిక్షణ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఒకప్పుడు దేశం కోసం... ఇప్పుడు కుటుంబం కోసం..