ETV Bharat / state

పనుల్లో వేగం పెరగాలి.. - devadhula

ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్​ దేవాదుల ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

పనులను పరిశీలిస్తున్న స్మితా సబర్వాల్
author img

By

Published : Feb 13, 2019, 5:50 AM IST

దేవాదుల ప్రాజెక్టు పనులను పరిశీలించిన స్మితా సబర్వాల్
దేవాదుల ప్రాజెక్టు పనులు వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన ఆమె.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. కన్నాయ్ గూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్ట్ ఇంటెక్ వెల్ వద్ద నీటి లభ్యత, పంపింగ్ విధానంపై అధికారులతో చర్చించారు. అనంతరం ములుగు మండలంలో 6వ ప్యాకేజీలో భాగంగా చేపట్టిన రామప్ప-పాకాల పంపు హౌజ్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని సబర్వాల్ అధికారులను అడిగి తెలుకున్నారు.
undefined

వెంకటాపూర్‌ మండలంలోని నల్లగుంట సమీపంలోని.. ప్యాకేజీ 2లో భాగంగా నిర్మిస్తున్న దేవాదుల మూడో విడత పైపులైను, రామప్ప సరస్సు నుంచి గణపురం చెరువులోకి వెళ్లే గ్రావిటీ కెనాల్‌ పైపులైను ఔట్‌ఫాల్‌ పనులను కూడా పరిశీలించారు. కొన్ని చోట్ల పనులు సాగకపోవడంపై అధికారులను నిలదీశారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్​రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి, ఇతర అధికారులు ఆమె వెంట ఉన్నారు. స్మితా సబర్వాల్... రామప్ప ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. రామప్ప శిల్ప కళా సంపదను వీక్షించారు. ఆ తర్వాత ములుగు చేరుకుని అక్కడినుంచి హైదరాబాద్​కు తిరుగుపయనమయ్యారు.

Intro:శిధిలావస్థలో మున్సిపాలిటీ భవనం బైట్స్

Body:శిధిలావస్థలో మున్సిపాలిటీ భవనం బైట్స్

Conclusion:శిధిలావస్థలో మున్సిపాలిటీ భవనం బైట్స్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.