ETV Bharat / state

మేడిగడ్డ వద్ద గోదారి పరవళ్లు.. అన్ని బ్యారేజీలు నీటితో కళకళ - మేడిగడ్డ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహితతో పాటు ఇటు ప్రధాన గోదావరి, అటు మానేరు నది నుంచి భారీగా వరద మేడిగడ్డలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఈ సంవత్సరం వానాకాలం సీజన్‌(ఖరీఫ్‌)లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం లేకుండా పోయింది.

full water level at medigadda reservoir due to rains
మేడిగడ్డ వద్ద గోదారి పరవళ్లు.. అన్ని బ్యారేజీలు నీటితో కళకళ
author img

By

Published : Sep 18, 2020, 9:18 AM IST

ప్రాణహితతో పాటు ఇటు ప్రధాన గోదావరి, అటు మానేరు నది నుంచి భారీగా వరద రావడంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ నుంచి ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటి వరకు 1,225 టీఎంసీల నీటి లభ్యత ఉండగా, 1,210 టీఎంసీలను దిగువకు వదిలారు. ప్రధాన గోదావరిపై ఉన్న ఎల్లంపల్లి నుంచి విడుదల చేసిన నీటితో పాటు మానేరు నదికి కూడా నిరంతరం ప్రవాహం ఉండటంతో సుమారు 160 టీఎంసీల నీరు సరస్వతి బ్యారేజీ(అన్నారం)కి చేరింది. ఇందులో మానేరు నుంచే దాదాపు 70 టీఎంసీలు వచ్చింది. అన్ని రిజర్వాయర్లు, బ్యారేజీలు పూర్తి స్థాయి మట్టాలతో ఉండటం, వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఈ సంవత్సరం వానాకాలం సీజన్‌(ఖరీఫ్‌)లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం లేకుండా పోయింది.

full water level at medigadda reservoir due to rains
తెలంగాణలో ప్రాజెక్టులకు వరద ప్రవాహం ఇలా..

సగానికిపైగా మునిగిన ఉమామహేశ్వరాలయం

శ్రీరాంసాగర్‌ (ఎస్సారెస్పీ) జలాశయం నిండడంతో దాని వెనుక జలాలతో నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలంలోని పంచగుడి వద్ద నది నిండుకుండను తలపిస్తోంది. ఇక్కడి వంతెన ఒడ్డునే ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వరాలయం నీటిలో సగానికి పైగా మునిగిపోయింది.

సగంపైగా మునిగిన ఉమామహేశ్వర ఆలయం

సరస్వతి బ్యారేజీ 50 గేట్లు ఎత్తివేత

అత్యధికంగా గురువారం తెల్లవారుజామున అటు గోదావరి, ఇటు మానేరు నుంచి ఐదు లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో సరస్వతి బ్యారేజీ 50 గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేశారు. ఈ బ్యారేజీకి సుమారు ఆరు కిలోమీటర్లపైన మానేరు నది వచ్చి గోదావరిలో కలుస్తుంది. దీంతో పాటు పెద్దవాగు తదితర వాగులున్నాయి. పార్వతి(సుందిళ్ల)-సరస్వతి బ్యారేజీల మధ్యలో 38 వాగులున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాల సమాచారం. ఈ వాగుల నుంచి కూడా ఈ సంవత్సరం ప్రవాహం ఉంది.

గోదావరి, మానేరు రెండు నదులు భారీగా ప్రవహిస్తే పెద్దవాగు తదితర వాటి నుంచి వచ్చే నీరు వెనక్కు తన్ని ఎక్కువ రోజులు పొలాల్లో నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ముందు జాగ్రత్తగా పెద్దవాగు మొదలైన వాటి నుంచి వచ్చే ప్రవాహం అన్నారం బ్యారేజీ దిగువన కిలోమీటరు దూరంలో గోదావరిలో కలిసేలా కాలువ తవ్వారు. దీనివల్ల పొలాల్లో ఎక్కువ రోజులు నీరు నిలిచిపోకుండా మేలు జరిగింది. అన్నారం బ్యారేజీ పూర్తి స్థాయి నీటిమట్టం 119 మీటర్లు కాగా గురువారం 117 మీటర్ల వరకు నిల్వ ఉంచి మిగిలిన నీటిని విడుదల చేశారు.

ఈ సంవత్సరం ప్రాణహితతో పాటు ప్రధాన గోదావరి, మానేరు నదుల నుంచి కూడా భారీగా ప్రవాహం ఉంది. ప్రాణహితతో సంబంధం లేకుండానే సుమారు 160 టీఎంసీలు వచ్చింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో గురువారం వరకు 20.18 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లంపల్లికి 94 టీఎంసీలు వచ్చింది. 2.20 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 2.37 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మిడ్‌మానేరుతో సహా అన్ని రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటిమట్టాలతో ఉండటం, కాళేశ్వరం పనులు ఇంకా కొన్ని మిగిలి ఉండటంతో ఎల్లంపల్లికి వచ్చిన నీటిని గోదావరికే వదిలేస్తున్నారు. శ్రీరాంసాగర్‌ కూడా పూర్తి స్థాయిలో నిండటంతోపాటు గేట్లు ఎత్తి నీటిని వదిలారు. దీంతో ఈ ఏడాది కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్లించాల్సిన అవసరం దాదాపు లేనట్లే.

ఇదీ చూడండి:కరోనా కారణంగా పరిమితంగానే బస్సు సర్వీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.