లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కే అనుకూలమని కేసీఆర్ గ్రహించినందునే స్థానిక సంస్థల ఎన్నికలకు తొందరపడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి వంద రోజులు దాటిందని.. అయినా సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇవ్వలేదని విమర్శించారు.
గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడానికి కూడా నిధులు లేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులన్ని దొడ్డి దారిన కాజేసి ఖజానాను ఖాళీ చేశారని ఆరోపించారు.
ఇవీ చూడండి : ప్రియురాలు మోసం చేసిందని ఉరి వేసుకున్నాడు