జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ప్రవాహం భారీగా పెరుగుతుంది. మహదేవపూర్ మండలం కుంట్లం ఇసుక క్వారీ నుంచి కొల్లూరు క్వారీకి గోదావరి నదిలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా... ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరిగింది. ఉద్ధృతి మరింత పెరుగుతుండటం వల్ల ఎటు వెళ్లలేని స్థితిలో అతను అక్కడే ఉండిపోయాడు.
ఎవరైనా నాకు సాయం చేయండి అంటూ కేకలు పెట్టాడు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగినా కాళేశ్వరం పోలీసులు హుటాహుటిని సంఘటనా స్థలానికి చేరుకొని నాటు పడవలో వెళ్లి అతడిని కాపాడారు. బాధితుడు ఇసుక క్వారీలో పనిచేసే జేసీబీ డ్రైవర్ జీవన్గా గుర్తించారు. నదీ ప్రవాహం పెరుగుతున్నందున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..