కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఘణపురం చౌరస్తాలో.. ఆల్ఇండియా ఫార్వడ్ బ్లాక్ పార్టీ ధర్నా చేపట్టింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనను సద్దుమణిగించారు.
వార్డు సభ్యులతో మీటింగ్ పెట్టి తీర్మానం చేయకుండా.. సర్పంచ్ ఓ వ్యక్తితో కుమ్మక్కై అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చాడని పార్టీ నేతలు ఆరోపించారు. అధికారులు తక్షణమే భూమిని సర్వే చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: 'కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు అందించాలి'